జగన్ ఓటమిపై కేటీఆర్ స్పందన
పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. కూటమి ఉన్నా 40 శాతం ఓట్లు వైసీపీకి రావడం గొప్ప విషయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీచేసి ఉంటే ఫలితాలు మరోవిధంగా ఉండేవని విశ్లేషించారు. జగన్ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువుగా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు.