ప్రమాదంపై కేటీఆర్ రియాక్షన్
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రచార ర్యాలీలో ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని ప్రజలను కోరారు. ప్రమాదం తర్వాత కేటీఆర్.. కొడంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాగా, ఆర్మూర్ పట్టణంలో నామినేషన్ ర్యాలీలో ప్రచార రథం నుండి కేటీఆర్ కిందపడిపోయారు.