Home Page SliderTelangana

తెలంగాణ మంత్రులపై కేటీఆర్ కీలక కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. వారిద్దరికి పదవులు పోవడం ఖాయమన్నారు. తాను ఢిల్లీకి వచ్చినందువల్ల కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ నేతలు తెలంగాణలో వసూళ్లు, బెదిరింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఉందని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారన్నారు. అధికార దుర్వినియోగం చేసిన సోనియా గాంధీతో సహా పలువురు పదవులు కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణలోని అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్రప్రభుత్వం, బీజేపీ ఎంపీలు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమవారికి లబ్ధి చేకూర్చారని ఝార్ఖండ్ సీఎంపై కేసు పెట్టారు. కానీ అలాంటి కేసును రేవంత్, పొంగులేటిపై కూడా పెట్టాలన్నారు.