కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదన్నారు. కాగా ఈసారి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి వచ్చే నిధులు గుండు సున్నానే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ మండిపడ్డారు.

