Home Page SliderTelangana

కేటీఆర్‌గారు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయండి

తెలంగాణాలో పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ పేపర్ లీక్‌తో రాష్ట్రంలో నిర్వహించిన పలు రకాల పరీక్షలను TSPSC రద్దు చేసింది. దీంతో ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో రద్దు చేసిన పరీక్షలను మరల నిర్వహించాలని TSPSC నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే TSPSC ఇటీవల పరీక్షల తేదీలను ప్రకటించింది. అయితే గ్రూప్-2 పరీక్షల తేదీలపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే గ్రూప్-2 పరీక్షల తేదీలు ప్రకటించిన సమయంలోనే రాష్ట్రంలో గురుకుల పరీక్షలు కూడా ఉన్నాయి. దీంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తీర్పునిచ్చింది. అయినప్పటికీ నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం తమ ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు తాజాగా తమ వినతిని అందజేశారు. గ్రూప్-2 పరీక్షలు ఉన్న నెలలోనే గురుకుల పరీక్షలు ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం లేదని పేర్కొన్నారు. గతంలో TSPSC పేపర్ లీక్ వ్యవహారంతో పరీక్షకు మానసికంగా సన్నద్ధం కాలేకపోయామని..పరిస్థితి అర్థం చేసుకోవాలని కేటీఆర్  కోరారు.