Home Page SliderPoliticsTelanganatelangana,

‘రైతుల కోసం జైలుకుపోతా’…కేటీఆర్

తెలంగాణలో తనకు ఓటేసిన పాపానికి రేవంత్ రెడ్డి, రైతుల భూములు కాజేశారని, వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు కేటీఅర్. తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం కావాలంటే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధం అన్నారు. రైతుల గొంతైనందుకు గర్వంగా జైలుకు పోతానన్నారు. తన ఎక్స్ ఖాతాలో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన నీకు రైతుల కష్టం కుట్రగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ప్రమేయం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.