Breaking NewsHome Page SliderNational

సుప్రీంలో కేటిఆర్‌కి చుక్కెదురు

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్యాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్‌‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది.దీంతో కేటిఆర్ అనుచ‌ర న్యాయ‌వాదులు డోలాయంలో ప‌డ్డారు. హైకోర్డు,సుప్రీం కోర్టుల్లోనూ క్వాష్ పిటీష‌న్ల‌ పై భంగ‌పాటుకి గుర‌వ‌డంతో బీ.ఆర్‌.ఎస్‌.శ్రేణుల్లో అల‌జ‌డి మొద‌లైంది.