Home Page SliderTelangana

ఫ్రస్టేషన్ లో ఉన్న కేటీఆర్ మైండ్ దొబ్బింది..

అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాడని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. అధికారులపై దాడి హేయమైన చర్య..కేటీఆర్ కు శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు. లెక్కలు తీస్తే.. దాడికి కుట్ర చేసిన వాళ్ల బొక్కలు విరుగుతాయన్నారు. కలెక్టర్ పై దాడి చేశాన్ని.. ముమ్మాటికీ ఇది కుట్రనే అని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్రలు చేస్తూ.. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడికి సంబంధించి కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారని చెప్పారు. ప్రభుత్వం అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అని ఆయన అన్నారు.