Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశంలో సినిమా స్టోరీ చెప్పిన కేటీఆర్

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఒక సినిమా స్టోరీ ద్వారా తెలంగాణా రాష్ట్ర చరిత్రను పంచుకున్నారు. ఒకప్పుడు తెలంగాణా వస్తుందా? రాదా ?అనే చర్చలతోనే టీవీ ప్రోగ్రాములు నిండిపోయేవని, ఎడతెగని పంచాయితీలా తెలంగాణా ఉండేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక సినిమా స్టోరీ చెప్పారు. తాను గోపీచంద్ హీరోగా నటించిన ఒక చిత్రం చూసానని, దానితో బ్రహ్మానందం ఒక గోతిలో పడతారని, దానినుండి బయటపడే క్రమంలో రాత్రంతా ఆ గోతిలోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. దానితో టైమ్‌పాస్ కోసం ఒకరితో తెలంగాణా వస్తుందా? రాదా? అనే చర్చ మొదలుపెడతాడని చెప్పారు. అంటే ఆరోజుల్లో తెలంగాణా వస్తుందనేది ఒక కలగా ఉండేదని, ఆంధ్రపాలకులు తెలంగాణా వారికి పరిపాలించడం చేతకాదని ఎద్దేవా చేసేవారని పేర్కొన్నారు. మీకు లీడర్లు లేరని, తెలివిలేదని, మీకంత సీన్ లేదనే విమర్శకులకు అభివృద్ధితోనే తెలంగాణా ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకోలేనిదని, సిరిసిల్లగడ్డ తనకు రాజకీయ జన్మనిచ్చిందని కేటీఆర్ ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు