ఈడీ విచారణకు కేటీఆర్.. ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తన నివాసం నుంచి నేరుగా ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఈడీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలిస్తున్నారు. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ మినహా మరెవరినీ అనుమతించలేదు.

