ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి కేటీఆర్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఆయనతో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. నేతలతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి పయనమవడంతో తెలంగాణ పొలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దేనికోసం ఢిల్లీకి వెళ్లనున్నారని చర్చ మొదలైంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఏదీ సఫలం కాలేదు. కవిత బెయిల్ పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో మనీశ్ సిసోడియాలకు బెయిల్ వచ్చింది. దీంతో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఆమెకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని సమాచారం.