చంచల్‌గూడ జైలుకి కేటీఆర్
చంచల్‌గూడ జైలులో ఉన్న జర్నలిస్ట్‌లు రేవతి, తన్వీ యాదవ్ లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు. జర్నలిస్ట్ లను అక్రమ కేసులతో వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే.. పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి సోమ, శుక్రవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్ కాపీలు అందిన వెంటనే.. చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.