కేటిఆర్‌ని జైలుకి…రేవంత్ ని ఇంటికి పంపాలి
మాజీ మంత్రి , బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు.తనని జైలు పంపితే …పోతా..యోగా చేసుకుంటా…పాదయాత్ర చేసుకుంటానని చెప్పడం బట్టి చూస్తేనే ఆయన ఆత్మన్యూనతా భావం అర్ధం అవుతుందన్నారు. లగచర్ల దాడి కేటిఆర్ పనే అన్నారు. రైతులను రెచ్చగొట్టి వాళ్లను జైళ్లకు పంపారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేష్టల వల్ల హైద్రాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతిందన్నారు. కేటిఆర్‌ని జైలు పంపాలి,రేవంత్ ని ఇంటికి పంపాలి అని ఆర్వింద్ పిలుపునిచ్చారు. ఆ రెండు కుటుంబాల వల్ల తెలంగాణా తీవ్రంగా నష్టపోయిందన్నారు.తాను తెలంగాణ బీజెపి అధ్యక్ష పదవి రేసులో ఉన్నాని, సంస్థాగత పదవులకు పోటీ పడటంలో తప్పులేదన్నారు.