మోదీ ,ఈడీ వెంట్రుక కూడా పీకలేరు- KTR
మునుగోడు ఉపఎన్నికలు అధికార,ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా KTR కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు..కోవర్ట్ బ్రదర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం వేటకుక్కల్లా మారి సీబీఐ,ఈడీని వాడుకుంటుందని KTR ఆరోపించారు. మోదీ ,ఈడీ తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. చావనైనా చస్తాం కానీ బీజేపీకీ భయపడే ప్రసక్తే లేదని KTR స్పష్టం చేశారు. ఈ ఉపఎన్నికల్లో ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్నాయి.

