బీఆర్ఎస్‌ది నేతల,చేతల,చేనేతల ప్రభుత్వం: మంత్రి కేటీఆర్
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిత్యం బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. కాగా ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.కాగా ఈ సభలో మంత్రి కేటీఆర్ ప్రసింగించారు.ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ పాలనలో సిరిసిల్ల ఉరిశాలగా మారిందన్నారు. అయితే ప్రత్యేక తెలంగాణా ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక సిరిసిల్లలో నేతన్నల బతుకులు మారాయని కేటీఆర్ తెలిపారు. ఇది నేతల ప్రభుత్వం ..చేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు.ఈ రోజు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా సిరిసిల్ల జిల్లా అభివృద్ది చెందింది అన్నారు. ఒకప్పుడు డిగ్రీ కాలేజీలు కావాలని ధర్నాలు చేసిన దుస్థితి నుంచి ఇప్పుడు సిరిసిల్లకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.