హైకోర్టులో కేటిఆర్ పిటీషన్
ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9న ఏసిబి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలంగాణ ఏసిబి కేటిఆర్ కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నెల6న ఆయన ఏసిబి కార్యాలయానికి వచ్చినట్లే వచ్చి…విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగారు.న్యాయవాదుల సమక్షంలో విచారించాలని కేటిఆర్ చేసిన విజ్క్షాపనను ఏసిబి తోసిపుచ్చింది.దాంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగారు.అనంతరం కోర్టు కూడా కేటిఆర్ క్వాష్ పిటీషన్ ని డిస్మిస్ చేసింది.ఈ నేపథ్యంలో ఈ నెల9న తాను ఏసిబి విచారణకు న్యాయవాదులతో హాజరౌతానని ,దానికి ఏసిబికి ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన బుధవారం పిటీషన్ దాఖలు చేశారు.

