జైలులో కేటీఆర్ ములాఖత్
సంగారెడ్డిలోని జైలుకు వెళ్లనున్నారు కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్టయిన 16 మంది రైతులను ములాఖత్‌లో కలిసి, వారిని పరామర్శిస్తారు. ఈ ములాఖత్‌కు కేటీఆర్‌తో పాటు మరో ఆరుగురికి అవకాశం ఇచ్చారు పోలీసులు. బాధితులనే కాకుండా వారి కుటుంబసభ్యులను కూడా కలిసి, మాట్లాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

