కేంద్రమంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు
కేంద్రమంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించేలా కామెంట్లు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. వారంలోపు క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.