మహిళల కోసం ‘అభయం యాప్’ లాంచ్ చేసిన కేటీఆర్
మహిళల భద్రత కోసం రాజన్న సిరిసిల్ల పోలీసులు రూపొందించిన ‘అభయం యాప్’ లాంచ్ చేసారు మంత్రి కేటీఆర్. ‘మై టాక్సీ సేఫ్’ అనే ట్యాగ్‌ను ఇచ్చిన పోలీసులు దానికి క్యూఆర్ కోడ్‌ను ఇచ్చి ఆటోకు లేదా టాక్సీకి అంటిస్తారు. దీనితో దానిలో ప్రయాణించేవారు డ్రైవర్ తీరు ప్రమాదమని పసిగట్టినప్పుడు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు వారుండే లొకేషన్‌ను పంపుతారు. . ప్రయాణికులు ఆటో లేదా క్యాబ్‌లోని క్యూ అర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు డ్రైవర్ ఫోటో వివరాలతో పాటుగా వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయి. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి నిందితులను వెంటనే పట్టుకోగలరు. ఈ కార్యక్రమంలో ఈ అభయం యాప్ ఎలా పని చేస్తుందో తెలిపే సీవీని కూడా ప్రదర్శించారు. కేటీఆర్ ఈ యాప్‌ను లాంచ్ చేస్తూ మహిళల భద్రత కోసం పోలీసులు రూపొందించిన ఈ యాప్ చాలా బాగుందని, సమర్థవంతంగా పని చేస్తుందని ప్రశంసించారు.