NationalNews

కేటీఆర్‌, కవిత బీజేపీలోకి ఎవరొచ్చినా వెల్‌ కమ్‌…

సీఎం కేసీఆర్‌ అండర్‌ గ్రౌండ్‌ ఛీఫ్‌ మినిస్టర్‌గా పని చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. ఎంపీ అరవింద్‌ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు గుండాలా ప్రవర్తిస్తున్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదన్నారు. బీజేపీలోకి కేటీఆర్‌, కవిత ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొన్ని నెలలుగా తెలంగాణలో పర్యటిస్తూ అనేక మందిని కలుస్తుంటే ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.