కేటీఆర్ ఆ కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు..ఎమ్మెల్సీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారని, కేసీఆర్ డైరక్షన్‌లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో తెలియట్లేదని కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. అంటూ కామెంట్స్ చేశారు.

