Home Page SliderTelangana

నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్..

ఎమ్మెల్యే కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవటానికి కారణం కేటీఆర్ కారణమన్నారు. నాగ చైతన్య, సమంతనే కాకుండా.. కొంత మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కారణం కేటీఆర్ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నిస్తూనే.. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి.. ముఖ్యంగా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అన్నారు మంత్రి సురేఖ. మంత్రి పదవి అడ్డు పెట్టుకుని.. అధికార మదంతో.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు.