కేటీఆర్‌కు ఈటల చురకలు, ఒకరోజు చాలా బాధపడాల్సి వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త
ప్రధాని మోడీని టూరిస్ట్ అంటావా?
కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన ఈటల రాజేందర్
BRS పెట్టీ మహారాష్ట్ర పోతున్నావు కదా మీరు టూరిస్ట్. మహారాష్ట్రలో ఎక్కడ పోతున్నావు.. తెలుగు మాట్లాడే వారు ఉన్నదగ్గరికి పోతున్నావు. చెల్లని ముఖాలను ప్రత్యేక విమానం పెట్టీ తీసుకువచ్చి ప్రగతి భవన్లో కండువాలు కప్పుతున్నావు. ప్రగతి భవన్ నీ పార్టీ కార్యాలయమా ? అంటూ ఈటల కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేటీఆర్‌ది… చిన్న వయసు, చదువుకున్న వాడివి… భవిష్యత్తు ఉన్నవాడివి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు. చీటర్ అంటున్నావు.. దళితున్ని సీఎం చేస్తా అని చెయ్యని కేసీఆర్ చీటర్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు ఈటల. మెట్రో ఓపెనింగ్‌కి వస్తే మోదీ పక్కన ఫోటోలు దిగింది మీరే కదా ? ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎందుకు ముందస్తు ఎన్నికలు పెట్టుకున్నావు. నరేంద్ర మోడీ ప్రభ ముందు తట్టుకోలేవు అని బతిమలాడి తెచ్చుకున్నావు.. కానీ ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ మొఖం వెలిసిపోయిందన్నారు ఈటల రాజేందర్.

GHMC ఎన్నికల్లో మీ ముఖం చెల్లలేదన్నారు. దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని… హుజూరాబాద్‌లో 600 కోట్లు పంచి పెట్టినా… మీ ముఖాలకు ఓట్లు పడలేదని ఈటల అన్నారు. దళిత బంధు ఇస్తా అని ఇవ్వలేదు. 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. బీసీ బంద్ ఇస్తా అని చీట్ చేసిన మీరే ముమ్మాటికీ చీటర్లని ఈటల విమర్శించారు. దేశంలోనే చీటింగ్ లో నెంబర్ వన్ మీరే ఉంటారన్నారు. అవినీతి లేకపోతే, చేయకపోతే.. 900 కోట్లు నీ పార్టీ అకౌంట్ లోకి ఎలా వచ్చాయన్నారు ఈటల. 2018-19 ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు. రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పినట్టు దేశమంతా ఫండింగ్ చేస్తా అనడానికి డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పాలన్నారు. ఎవరికి ఎన్ని డబ్బులు పంపించారు తెలియదా? సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటికి వస్తాయన్నారు ఈటల. మోడీని విమర్శించడమంటే… సూర్యుని మీద ఉమ్మి వేయడమేనన్నారు.

