Home Page SliderTelangana

కేటీఆర్‌వి డైవర్షన్ పాలిటిక్స్..కోమటిరెడ్డి

కేటీఆర్ అమృత టెండర్లపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి తోక చుట్టం అన్నారు. కేసుల నుండి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. కవిత, సృజన్ రెడ్డి కూడా వ్యాపార భాగస్వాములని పేర్కొన్నారు. నిజానికి పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి కేటీఆర్ జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుకే కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.