Home Page SliderPoliticsTelanganatelangana,

కేటీఆర్‌ ఎలాంటి లబ్ది పొందలేదు..అవినీతి జరిగిన ఆధారాలే లేవు

‘ఫార్ములా-ఈ రేసు’ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ రేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో అవినీతి జరిగిందంటూ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఎవరి అనుమతి తీసుకోకుండా రూ.54 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. కేటీఆర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసులో సెక్షన్లు ఎంతమాత్రం కేటీఆర్‌కు వర్తించవని, ఈ రేసు నిర్వహణలో ఒప్పందంలో పురపాలక శాఖ కార్యదర్శి సంతకం చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ ఎక్కడా లబ్ది పొందలేదని, అవినీతి జరిగిన ఆధారాలేం లేవన్నారు. పలు తీర్పులు ప్రస్తావిస్తూ ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ వాదించారు.