తెలంగాణా ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్‌లైన్
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి తెలంగాణాలోని ప్రాజెక్ట్‌ల పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న కరీంనగర్‌లో పర్యటించిన కేటీఆర్ బృందం మిడ్ మానేరు డ్యామ్‌ను పరిశీలించింది.ఈ మేరకు కేటీఆర్ ఇవాళ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణా ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలన్నారు.అయితే ఆగస్టు 2 లోగా పంపులు ఆన్ చేయాలని కేటీఆర్ తెలంగాణా ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. కాగా ఈ నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని ఇంజనీర్లు కూడా చెప్తున్నారన్నారు.ఈ క్రమంలో మీరు పంపులు ఆన్ చేయ్యకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో మేమే 50 వేలమందితో కలిసి పంపులు ఆన్ చేస్తామన్నారు.

