Home Page SliderTelangana

రేవంత్‌పై వైరల్ అవుతున్న కేటీఆర్ ‘చిట్టినాయుడు ట్వీట్’

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. చిట్టినాయుడు సుభాషితాలు అంటూ ఎద్దేవా చేశారు. కంప్యూటర్ గురించి అంతా తెలిసినట్లు, దానిని రాజీవ్ గాంధీయే కనిపెట్టినట్లు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని, నోటి కొచ్చింది వాగొద్దని హెచ్చరించారు. కంప్యూటర్‌ను కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ అని తెలియజేశారు. TIFRAC నుండి 1956లో భారత్‌లో కంప్యూటర్ సేవలు ప్రారంభమయ్యాయని, అప్పటికి రాజీవ్‌ గాంధీకి కేవలం 12 ఏళ్ళ వయసుంటుందని పేర్కొన్నారు. రేవంత్‌కి తెలియని విషయాల జోలికి పోకుండా తెలిసిన రియాల్టీ దందాలు, బ్లాక్‌మెయిల్స్‌కి పరిమితమయితే బాగుంటుందమ్మా చిట్టీ అంటూ ట్వీట్ చేశారు. సోమవారం సెక్రటేరియట్‌ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహప్రతిష్టాపన సందర్భంగా కేటీఆర్‌పై రేవంత్ విరుచుకు పడడమే దీనికి కారణం. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెప్తున్న కేటీఆర్‌కి రాజీవ్ గాంధీ గురించి తెలియదన్నారు. ఆ కంప్యూటర్‌ను భారత్‌కు తీసుకువచ్చిందే రాజీవ్ గాంధీ అన్నారు. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ, సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో ఛాయ్, సమోసా అమ్ముకునేవాడివి అని మండిపడ్డారు. దీనికి జవాబుగానే కేటీఆర్ అలా స్పందించారు.