BusinessHome Page SliderTelangana

బిర్యానీ గురించి మాట్లాడా

హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల నగరానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సత్యనాదెళ్ల తెలుగువారు కావడం, హైదరాబాదీ కావడంతో మంత్రి కేటీఆర్, సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ వివరాలను కేటీఆర్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఇద్దరు హైదరాబాదీలు సమావేశం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిర్యానీ గురించి మాట్లాడుకున్నామన్నారు. నవీన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను గురించి ,తెలంగాణాలో ఐటీ అనుబంధరంగాల అభివృద్ధి గురించి సత్యనాదెళ్లకు వివరంగా చెప్పినట్లు తెలియజేశారు.