నిఖిల్ కామత్ అభిప్రాయాన్ని తప్పుబట్టిన కృతి సనన్
బాలీవుడ్ ఇంకా మనుగడ సాధించడంలోనే ఉంది, అభివృద్ధి చెందడం లేదని యూట్యూబర్, వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ చేసిన కామెంట్స్‌ను నటి కృతి సనన్ కొట్టిపారేసింది. ఆమె తన చివరి రెండు చిత్రాలు విడుదలైన క్రూ, తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా విజయాన్ని ఉదాహరణగా పేర్కొంటూ కామత్ వ్యాఖ్యను కొట్టిపారేసింది. విమర్శల మధ్య కృతి సనన్ బాలీవుడ్‌ను పొగిడింది. రూ. 100 కోట్ల సంపాదన ఇప్పుడు సాధారణమని ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. నటి కృతి సనన్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమకు మద్దతు పలికింది, ఇటీవలి సినిమాలు వాణిజ్య పరంగా అంత మార్కెట్ చేసుకోనందున, ఇంకా ఆ విషయాలు అంత ప్రాముఖ్యతని సంతరించుకోలేదు. బాలీవుడ్ చిత్రాలపై ప్రజల అంచనాలు ఇంకా పెరుగుతున్నాయని ఆమె వాదించింది; అందుకే, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసినా పెద్దగా తేడా కనబడటం లేదు.
యూట్యూబర్‌తో విభేదిస్తూ, 34 ఏళ్ల నటి ఇలా చెప్పారు. “ఇంతకుముందు, ఒక చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేస్తే, అది పెద్ద విషయం. ఇప్పుడు, రూ.100 కోట్లు సర్వసాధారణం. కాబట్టి, అంచనాలు ఎక్కడికో పోయాయి. అందులో (బాలీవుడ్) (అభివృద్ధి చెందని) ఒక దశ ఉంది, కానీ ఇప్పుడు థియేటర్లు ఎక్కువ పెట్టుబడితో తిరిగి కడుతున్నారు, అవి కలెక్షన్ల విషయంలో, రేట్ల విషయంలోను ఎక్కువ డబ్బును రాబడుతున్నాయి. చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి.” అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయకుడు – రాపర్ బాద్షా, కృతితో ఏకీభవించారు.
కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు సరసన 1: నేనొక్కడినే చిత్రంలో నటించింది. 2014లో టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గాడ్‌ఫాదర్ లేనప్పటికీ, నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సక్సెస్ అయింది. పదేళ్ల తర్వాత, కృతి బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు, కృతి తన స్క్రిప్ట్‌లను తానే ఎంచుకునే స్థాయిలో ఉందని, అది తనకు ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల కాదని సినిమా సక్సెస్ వల్లేనని ఆమె చెప్పారు. కృతి సనన్ తదుపరి సినిమాలు దో పట్టి, హౌస్‌ఫుల్ 5లో యాక్ట్ చేయనుంది. ఆమె దో పట్టీకి నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పారు.

