రామ్‌చరణ్ కోసం సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన కృష్ణవంశీ
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఇప్పుడు “గేమ్ ఛేంజర్” ని పూర్తి చేయగా ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా అలాగే దర్శకుడు సుకుమార్‌లతో భారీ సినిమాలు చరణ్ నుంచి రాబోతున్నాయి. అయితే చరణ్ కోసం ఒక సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేశానని వెర్సటైల్ దర్శకుడు కృష్ణ వంశీ లేటెస్ట్‌గా తెలపడం మెగా ఫ్యాన్స్‌లో ఉత్సుకత నెలకొంది.
అయితే రీసెంట్‌గా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో కృష్ణవంశీకి మళ్ళీ చరణ్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురు కాగా దీనికి తాను చరణ్‌తో సినిమా చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే, చరణ్ కూడా సిద్ధం అయితే తప్పకుండా సినిమా చేస్తానని ఒక సూపర్ ఐడియా సూపర్ స్క్రిప్ట్ తన కోసం సిద్ధం చేసానని చెప్పుకొచ్చారు. ఇక అంతా చరణ్ చేతిలోనే ఉందని కృష్ణవంశీ తెలిపారు. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “గోవిందుడు అందరివాడేలే” సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరి మళ్ళీ వీరి కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందో లేదో చూడాలి.