జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా కోనేటి పుష్పలత
జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె పదవిని కోల్పోయారు. ఈ క్రమంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి ఇవాళ ఎన్నిక నిర్వహించగా 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీమంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు పుష్పలతకు మద్దతిచ్చారు. వేరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మాజీ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి సైతం చివరలో పుష్పలతకే మద్దతు ప్రకటించడం విశేషం. దీంతో బీఆర్ఎస్ పార్టీ చైర్ పర్సన్ పీఠాన్ని కాపాడుకోగలిగింది.