Home Page SliderTelangana

కాంగ్రెస్ కు కోనప్ప గుడ్ బై

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. తన భవిష్యత్తును సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని, వారి అభిప్రాయమే శిరోధార్యమని అన్నారు, అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్ కు అధిష్టానం ప్రోత్సహిస్తున్నదని కాంగ్రెస్ పై కోనప్ప ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరి కృష్ణకు ఆయన మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం అనుచరులు, కార్య కర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.