ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీమ్
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం “జల్, జంగల్, జమీన్” నినాదంతో పోరాడిన విప్లవ యోధుడు కొమురం భీమ్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఘన నివాళులు అర్పించారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆయన తన నివాళి అర్పిస్తూ, ఆ మహనీయుడి త్యాగాలను స్మరించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో కొమురం భీమ్ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో జోడేఘాట్‌ను చారిత్రాత్మక స్మారక క్షేత్రంగా తీర్చిదిద్దారు. అలాగే హైదరాబాద్ హృదయంలో కొమురం భీమ్ స్మారక భవనం నిర్మించి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని మరింతగా నిలబెట్టారు” అని పేర్కొన్నారు.
“కొమురం భీమ్ పోరాటం మనందరికీ నిత్య స్ఫూర్తి. ఆయన కలల సాధనకు, ఆదివాసీల హక్కుల రక్షణకు మనం కలిసి కృషి చేయాలి,” అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.