బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు నుంచి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మునుగోడు నుంచి బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. 2009లో ఆయన భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదాలతో ఆయన పార్టీ మారారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం విశేషం. అయితే తాను కేసీఆర్ ఫ్యామిలీపై వ్యతిరేకతతో నాడు బీజేపీలో చేరానన్న రాజగోపాల్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ సర్కారును సాగనంపాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందంటూ పార్టీ మారుతున్నానన్నారు.

