ఏపీ ప్రత్యేక హోదా గురించి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదా గురించి మరోమారు తెరమీదకు తెచ్చారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అమలు చేయకపోవడం విచారకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. ఏపీ, తెలంగాణ విభజన వేళ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో చేసిన హామీలు మరిచిపోరాదన్నారు. దానిని సాధించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.