NationalNewsTrending Today

మంచి మనస్సు చాటుకున్న కోలివుడ్ హీరో

మన తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిందో తెలిసిందే. ప్రాణ నష్టం కూడా జరిగింది. వరదల వల్ల ప్రజలు ఎంతగానో బాధ పడుతున్నారు.

ఈ క్రమంలో మన టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు వాల్లకి తోచినంత విరాళాలు ఇస్తున్నారు. మొదటగా జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకి చెరొక 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా తెలుగు సినీ ప్రముఖులు తమకు తోచినంత విరాళాలు ఇస్తున్నారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క ఇండస్ట్రీ నుంచి మొదటిసారిగా కోలివుడ్ హీరో శింబు విరాళాన్ని ప్రకటించారు. ఆయన రెండు రాష్ట్రాలకి కలిపి 6 లక్షల రూపాయలని ఇచ్చి తన మంచి మనస్సుని చాటుకున్నాడు. శింబుని ‘అడాప్టెడ్ సన్’ అని సోషల్ మీడియాలో పిలుస్తున్నారు. ఎంత ఇచ్చాం అన్నది కాదు, ఇచ్చే మనస్సు ఉందా లేదా? అని పొగుడుతున్నారు.