కోల్‌కతా హత్యాచారకేసు: నేడు సుప్రీంలో, కోల్‌కతా హైకోర్టులో రెండుచోట్ల..
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో నేడు రెండు కీలక కోర్టుల్లో వాదనలు జరగనున్నాయి. వీటిలో ఒకటి సుప్రీంకోర్టులో కాగా, మరొకటి కోల్‌కతా స్పెషల్ కోర్టులో కావడం విశేషం.
సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించనుంది. వీరిలో ప్రధానన్యాయమూర్తి చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ కేసులో 100 మంది న్యాయవాదులు 42 పిటిషన్ల తరపున వాదించనున్నారు. కోల్‌కతా స్పెషల్ కోర్టులో నిందితులుగా ఉన్న సందీప్ ఘోష్, మండల్‌ల తరపున బెయిల్‌ను నిరాకరించారు. వీరిపై నేరం రుజవయ్యే పక్షంలో వీరికి మరణశిక్ష పడే అవకాశం ఉన్నందున వారికి బెయిల్ మంజూరు చేయలేమని న్యాయ విశ్లేషకులు పేర్కొన్నారు. సీబీఐ వాంగ్మూలం ప్రకారం ఈ కేసుకు సంబంధించిన రుజువులను నిందితుడు మండల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నటాలా పోలీస్ స్టేషన్‌లో తారుమారు చేశారని పేర్కొన్నారు. కోల్‌కతా స్పెషల్ కోర్టులో సీబీఐ నిందితులు మండల్, ఘోష్‌ల రిమాండ్‌కు కోరుతున్నారు. ఆ విచారణ జరగనుంది.