గుండె పట్టుకున్న కోహ్లీ.. హార్ట్ బీట్ చెక్ చేసిన సంజూ
నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తూ ఒక్కసారిగా గుండె పట్టుకున్నారు. ఆపై రాజస్థాన్ టీం కెప్టెన్ శాంసన్ దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరారు. దీంతో సంజూ కోహ్లి ఛాతిపై చేయి పెట్టి చూశారు. అనంతరం విరాట్ బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ లో కొన్నేళ్లుగా ఫిట్ గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి ఒకరు. అలాంటిది విరాట్ ఇలా కనిపించడం ఫ్యాన్స్ కు ఆందోళనకు గురిచేసింది.

