Home Page SliderNational

గిల్ సోదరిపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

ఈ IPL సీజన్‌ చివరి దశకు చేరుకోబోతుండగా ఈసారి IPL ట్రోఫీ ఎవరిని వరించనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న IPL చివరి లీగ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. కాగా నిన్న జరిగిన GT VS RCB మ్యాచ్‌లో బెంగుళూరుపై గుజరాత్ టైటన్స్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. దీంతో గుజరాత్ టైటన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా..బెంగుళూరు టీమ్ ఇంటి బాట పట్టింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ,శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబరిచారు.కాగా వీరిద్దరు నిన్నటి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగారు. అయినప్పటికీ బెంగుళూరు టీమ్‌కు ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ సోదరి షాహనీల్  నిన్న మ్యాచ్ ఫోటోలను “ఇది సంతోషకరమైన రోజు” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమెపై కోహ్లీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కాగా దీనిపై విరాట్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ..కామెంట్స్ చేస్తున్నారు. దీంతో  విరాట్,గిల్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైనట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ ఫ్యాన్స్‌లో కొందరు గిల్ చెల్లిని కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు మాత్రం ఇది గేమ్ అని ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ అని ట్వీట్ చేస్తున్నారు.

Read more:

యంగ్ టైగర్ బాలీవుడ్ ‘ఎంట్రీ’పై క్లారిటీ