IPLలో కోహ్లీ కొంపముంచిన అత్యుత్సాహం
ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ప్రదర్శించే ఆటతీరు మనకందరికీ సుపరిచితమే. మ్యాచ్‌లో విరాట్ ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ..ఆటలో దూకుడుగా వ్యవహరిస్తాడు. దీంతో విరాట్‌ను అతని ఫ్యాన్స్ అంతా మిస్టర్ దూకుడు అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ దూకుడు తనమే విరాట్ కొంప ముంచుతుందని చెప్పాలి. కాగా నిన్న జరిగిన CSK Vs RCB మ్యాచ్‌లో విరాట్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

కాగా ఈ సీజన్ IPL లో బెంగుళూరు జట్టు సొంత గడ్డపై మరోసారి ఓటమిపాలయ్యింది. దీంతో బెంగుళూరు జట్టు మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో CSK జట్టు RCB కి 227 పరుగుల లక్ష్యఛేదనాన్ని నిర్ధేశించగా ఎంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన RCB జట్టు 218 పరుగులు చేసి కేవలం 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీకి జరిమానా పడింది. కాగా నిన్నటి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అత్యుత్సాహం కనబరిచినందుకుగాను మ్యాచ్ రిఫరీ కోహ్లీకి జరిమానా విధించారు. నిన్నటి మ్యాచ్‌లో CSK బ్యాటర్ శివమ్ దూబే 26 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సంబరాలు శ్రుతిమించడంతో అతనికి జరిమానా తప్పలేదు. దీంతో RCB జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ తన మ్యాచ్ ఫీజులో 10% కోతకు గురయ్యాడు. IPL కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 యాక్ట్ కింద లెవల్ 1 నేరానికి పాల్పడడంతో కోహ్లీకి జరిమానా విధించాల్సి వచ్చిందని IPL సలహ కమిటీ పేర్కొంది.


 
							 
							