బౌండరీ కొట్టి, ఆనందంలో చిందేసిన కోహ్లి
స్టార్ క్రికెటర్ కోహ్లి ఏం చేసినా అది ఫ్యాన్స్‌కు సంబరమే. వెస్ట్ ఇండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా చాలా సంతోషంగా ఉంది. అయితే బ్యాటింగ్ చేస్తూ బౌండరీ కొట్టారు కోహ్లి. దీనితో డాన్స్‌తో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 81 బంతులకు బౌండరీ కొట్టిన కోహ్లి మంచి డ్యాన్సర్‌లా చాలా రిథమ్‌తో స్టెప్పులు వేసారు. పక్కనే న్న జైశ్వాల్ కూడా సంబరపడుతూ నవ్వుతున్నారు. ఈ డ్యాన్స్ మూమెంట్స్‌ను ఫ్యాన్ కోడ్ అనే గ్రూప్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లు అశ్విన్ ధాటికి విండిస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. మొదటి మ్యాచ్‌లోనే 171 రన్స్‌తో మెరుపులు మెరిపించాడు యశస్వి జైస్వాల్. దీనితో భారత్ టీమ్ సంతోషానికి అవధులు లేవు. రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 20న మొదలవుతుంది.

