త్వరలో ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న కింగ్ కోహ్లీ..!
సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి ఈ పేర్లు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. క్రికెట్ ప్రియులకి వీరి పరిచయం అక్కర్లేదు. రిటైర్మెంట్ అయ్యి చాలా సంవత్సరాలైనా సచిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక కోహ్లి గురించైతే చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన టీ 20 కి రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం ODI, టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో జరుగనున్న మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన సచిన్ – 623 ఇన్నింగ్స్‌లు (226 టెస్టు ఇన్నింగ్స్‌లు, 396 ODI ఇన్నింగ్స్‌లు, 1 T20I ఇన్నింగ్స్). కాగా, కోహ్లి ఇప్పటి వరకు ఫార్మాట్‌లలో 591 ఇన్నింగ్స్‌లు ఆడి 26,942 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లి మరో 58 పరుగులు సాధిస్తే, 147 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ రికార్డ్ బద్ధలవుతుంది. చరిత్రలో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.