Home Page SliderNationalSports

కోహ్లి అభిమానులకు నిరాశ..

భారత టీమ్ స్టార్ బ్యాటర్‌గా రాణించిన విరాట్ కోహ్లి ప్రస్తుతం అతి పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. రంజీలో కోహ్లి బ్యాటింగ్ చూద్దామని మైదానానికి పోటెత్తిన అభిమానులకు నిరాశే మిగిలింది. 12 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన  రంజీ ట్రోఫీలో కూడా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. రైల్వేస్ బౌలర్ సంగ్వాన్ వేసిన బంతి ఆఫ్ స్టంప్‌కు తగలడంతో అవుటయ్యాడు. ఢిల్లీ తరపున బరిలోకి దిగిన కోహ్లి సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో ఇప్పటికే విఫలమైన స్టార్ బ్యాటర్ల లిస్టులో చేరిపోయాడు. ఇలాగే ఇంతకు ముందు జరిగిన రౌండ్ల మ్యాచ్‌లలో రిషభ్ పంత్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా పరుగులు చేయలేకపోయారు. విరాట్ పరుగులు చేయకపోయినా క్రీజులో నిలదొక్కుకుంటే చూద్దామనుకున్నారు అభిమానులు. దీనితో కోహ్లి ఔటయిన వెంటనే నిరాశ చెందిన అభిమానులు బయటకు వెళ్లిపోయారు. రైల్వేస్ ఈ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేస్తే, ఢిల్లీ 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.