విశాఖకు కోడి కత్తి కేసు బదిలీ
ఏపీలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. కాగా విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేయడంతో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ షెడ్యూలు ఇప్పటివరకు కొనసాగింది. ఈ నెల ఒకటో తేదీ విచారణ వాయిదా సందర్భంగా కేసును విశాఖకు బదిలీ చేస్తున్నట్లు గత వాయిదా సందర్భంగా న్యాయమూర్తి ప్రకటించారు. అయితే మంగళవారం వాయిదా సందర్భంగా అధికారికంగా ఉత్తర్వులు వెలువరించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని కోరుతూ జగన్ తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు తోసిపిచ్చింది. దీంతో ప్రస్తుతం జగన్ మరో పిటిషన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని విచారణ పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మరో మారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగాల్సి ఉంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టు అధికారిక ఉత్తర్వులు మేరకు ఈ నెల 29వ తేదీ నుంచి కోడి కత్తి కేసు విశాఖలో కొనసాగనుంది.

