Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం అధిష్టానంపై కోడెల శివరాం తిరుగుబాటు

టీడీపీ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైనట్లు కన్పిస్తోంది. కాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం టీడీపీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కోడెల శివరాం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అగ్రనేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఇస్తామంటే ఒక పార్టీ,పదవులు వస్తాయంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారే వారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. టీడిపి అధినేత చంద్రబాబును తీవ్రంగా దుర్బాషలాడి కేసులు వేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇంఛార్జి పదవి ఇవ్వటమేంటని ఆయన ప్రశ్నించారు. ఇంఛార్జి పదవిపై నిర్ణయం తీసుకునే విధానం కరెక్ట్ కాదని దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అధిష్టానంపై భగ్గుమన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కన్నలక్ష్మినారాయణను సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.అయితే దీనిపై కోడెల శివరాం అసహనం వ్యక్తం చేస్తున్నారు.