Home Page SliderNational

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా అధికార పక్షంపై నిన్న జరిగిన టీడీపీ మహనాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు బరిలోకి దిగారు. టీడీపీ మహానాడుపై, అందులో భాగంగా చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రముఖుల చేత తనను పొగిడించుకోవడం కోసమే దివంగత ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదన్నారు. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? అని ప్రశ్నించారు కొడాలి నాని. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదన్నారు. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారు అని నాని ఫైర్‌ అయ్యారు.