Andhra PradeshBreaking NewsHome Page Slider

కొడాలి నానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్‌ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా , పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.