Andhra PradeshHome Page Slider

ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట

ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. అయితే గతంలో వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నాని అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కొడాలి నానికి 41A నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.