కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగోడు
నీతిమంతుల ఆదాయం చెప్పి…అవినీతిమంతుల భరతం పడుతూ ఎక్కడికక్కడ అభివృద్ది లెక్కలు తేల్చే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్) గా ఈ సారి తెలుగోడికి అవకాశం దక్కింది.కాగ్ ఏర్పడిన ఇన్నేళ్లలో ఎప్పుడూ తెలుగు వారు నియమితులవలేదు. తొలిసారిగా ఆడిటర్ జనరల్ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ,1989 క్యాడర్ కి చెందిన కె.సంజయ్ మూర్తి కొనసాగబోతున్నారు.దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.ఈయన తన పదవిలో 4ఏళ్ల పాటు కొనసాగనున్నారు.