తొలి వన్డేలో ఇండియాపై కివీస్ విజయం
టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ దుమ్మురేపడంతో ఇండియా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీ, కేన్ విలియమ్సన్ అజేయంగా 94 పరుగులు సాధించడంతో న్యూజిలాండ్ విజయం నల్లేరుపై నడకయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈడెన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ వికెట్లను కోల్పోయింది. అయితే, లాథమ్ మరియు విలియమ్సన్ వరుసగా 145* మరియు 94* పరుగులతో తమ జట్టును మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ తమ హాఫ్ సెంచరీలతో టీమ్ ఇండియాను 306/7కు చేర్చారు. లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీలు తమ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.